ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ సహా మరికొన్ని ప్లాట్ ఫాంలకు సంబంధించిన సెల్లర్స్ ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రైడ్స్ చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలతో దేశవ్యాప్తంగా ఈ దాడులు చేపట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరులో సహా ఇతర పట్టణాల్లో మొత్తం 24 ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు చేసింది. వీరితో పాటు పలువురు వ్యాపారస్తుల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు.