PMSYM: వృద్ధ దంపతులకు సంవత్సరానికి రూ.72,000

85చూసినవారు
PMSYM: వృద్ధ దంపతులకు సంవత్సరానికి రూ.72,000
కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన’ స్కీమ్‌ను అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం అమలు చేస్తోంది. 18-40 ఏళ్లలోపు వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. స్కీమ్‌లో చేరిన వారు నెలకు కొంత మొత్తాన్ని చెల్లించాలి. 60 ఏళ్లు నిండాక లబ్ధిదారులకు ప్రతి నెలా రూ.3,000 అందుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ చేరితే ఏడాదికి రూ.72,000 అందుకోవచ్చు. పూర్తి వివరాలకు టోల్‌-ఫ్రీ నంబ‌ర్ 1800 267 6888కి కాల్ చేయ‌వ‌చ్చు.

సంబంధిత పోస్ట్