ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైంది: రేవంత్

62చూసినవారు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ సచివాలయంలో సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు నీళ్ళు, నిధులు, నియామకాలతో పాటు విద్య కూడా ఓ భావోద్వేగం అని అన్నారు. 'గత ప్రభుత్వ హయాంలో బడ్జెట్ కేటాయింపుల్లో విద్యా శాఖకు అన్యాయం జరిగింది. మా ప్రభుత్వం వచ్చాక విద్యా శాఖకు బడ్జెట్ పెంచాం. భవిష్యత్తులో ఇంకా పెంచుతాం' అని సీఎం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్