దర్శన్‌ను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి: యోగేశ్వర్‌

82చూసినవారు
దర్శన్‌ను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి: యోగేశ్వర్‌
బెంగళూరులో అభిమాని హత్య కేసులో నిందితుడైన కన్నడ నటుడు దర్శన్‌ను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆయనకు పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని విపక్ష భాజపా ఆరోపిస్తోంది. దర్శన్‌ను చన్నపట్న అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోటీ చేయించేందుకు డీకే సోదరులు ప్రణాళిక వేశారని భాజపా నేత సీపీ యోగేశ్వర్‌ ఆరోపించారు. అయితే దర్శన్‌ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నందున ఆయన్ను అభ్యర్థిగా నిలపడం సాధ్యం కాదని చెప్పారు.