నేడు విశాఖకు రక్షణ మంత్రి రాజ్​నాథ్

77చూసినవారు
నేడు విశాఖకు రక్షణ మంత్రి రాజ్​నాథ్
రక్షణమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన రాజ్‌నాథ్‌సింగ్‌ ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలోని తూర్పు నౌకాదళం ముఖ్య కార్యాలయానికి ఆయన రానున్నారు. ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటలకు దిల్లీలో బయలుదేరిన ఆయన మధ్యాహ్నం 12.20 గంటలకు విశాఖపట్నంలోని నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌ ‘ఐఎన్‌ఎస్‌ డేగా’కు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 12.50 గంటలకు విశాఖ తీరంలో ఉన్న ఐఎన్‌ఎస్‌ జలాశ్వ నౌకపై దిగనున్నారు.