మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా పాక్ ఐఎస్‌ఐ మద్దతుతో ఖలిస్థానీ సానుభూతిపరులు ఆయనపై దాడి చేసేందుకు కుట్ర పన్నారని ఢిల్లీ పోలీసులను నిఘావర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు భద్రతను సమీక్షించడంతో పాటు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.