బ్యాటరీ ఛార్జ్‌ చేస్తుండగా ఎలక్ట్రిక్‌ బైక్‌లో మంటలు (వీడియో)

72చూసినవారు
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూరారం ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఆదిత్య మెడికల్ షాపు ముందు పార్క్ చేసిన ఎలక్ట్రికల్ బైక్‌లో మంటలు చెలరేగాయి. మెడికల్ షాప్‌కు మంటలు వ్యాపించాయి. వాహనం బ్యాటరీ ఛార్జ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనం పూర్తిగా దగ్ధం కాగా.. మెడికల్ షాపు ముందు భాగం పాక్షికంగా దగ్ధమైంది. దీంతో ఆ రోడ్డుపై ట్రాఫిక్‌ స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

సంబంధిత పోస్ట్