కామన్వెల్త్‌ గేమ్స్‌లో హాకీ తొలగింపు

77చూసినవారు
కామన్వెల్త్‌ గేమ్స్‌లో హాకీ తొలగింపు
స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగే 2026 కామన్వెల్త్‌ క్రీడల్లో హాకీకి చోటుదక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ఖర్చుల నియంత్రణ భాగంగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు పత్రికలు కథనాలు వెలువరించాయి. వచ్చే ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 2 వరకు ఈ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. హాకీ, నెట్ బాల్, రేసింగ్‌తో పాటు మరో ఆరు ఈవెంట్‌లను తొలగిస్తారని సమాచారం.