భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ఉద్ధృతి కోనసీమను తాకింది. పి.గన్నవరం నియోజకవర్గం గంటి పెదపూడిలో నదిపాయ గట్టు తెగింది. ఈ క్రమంలో గంటి పెదపూడి, బురుగులంక, అరిగెల వారిపాలెం, పెదలంక నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గట్టు తెగిపోవడంతో నాలుగు గ్రామాల ప్రజలు పడవపైనే ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వరద పెరుగుతుంది అనటానికి మొదటి సంకేతం.