కర్నూలు జిల్లా కల్లూరు మండలం దొడ్డిపాడుకి చెందిన పెద్దయ్య (59) తాను చనిపోతూ మరో ముగ్గురికి ప్రాణదానం చేశాడు.పెద్దయ్యకు ఇటీవల తలనొప్పి రావడంతో కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చివరికి బ్రెయిన్ డెడ్ కావడంతో మరణించాడు. అయితే వైద్యులు అవయవదానం గురించి చెప్పడంతో పెద్దయ్య కుటుంబసభ్యులు అందుకు అంగీకరించారు. దీంతో అతని లివర్, రెండు కిడ్నీలను సేకరించి వేరు వేరు ఆసుపత్రులకు తరలించారు.