ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా గిన్నిస్ రికార్డు సృష్టించిన టొమికో ఇటూక (116) శనివారం మరణించారు. జపాన్‌కు చెందిన టొమికో ఇటూకకు పర్వతారోహకురాలిగా మంచి గుర్తింపు ఉంది. జపాన్ లోని 3,067 మీటర్ల ఎత్తైన మౌంట్ ఆన్టేక్ పర్వతాన్ని టొమికా ఇటూక రెండు సార్లు అధిరోహించారు. కాగా 2024లో ప్రపంచలోనే అత్యంత వృద్ధ మహిళగా టొమికో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు.