TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై జరిగిన దాడికి నిరసనగా గురువారం ఆందోళనలు చేయాలని ఉద్యోగుల ఐకాస నిర్ణయించింది. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట గురువారం ఆందోళనలు చేపట్టాలని, లంచ్ టైమ్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చింది. మరోవైపు లగచర్ల దాడి ఘటనను ఐఏఎస్ అధికారుల సంఘం సీరియస్గా తీసుకుంది. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.