హైదరాబాద్‌లో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని మరణించింది. గండిపేటలోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోన్న శివాని (21) ఇటీవల ఊరెళ్లింది. సోమవారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఆమె స్నేహితుడితో కలిసి బైక్‌పై హాస్టల్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో వెనుక నుంచి కారు బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో శివాని అక్కడికక్కడే మరణించగా యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.