HYD: మాదాపూర్ లోని శ్రీచైతన్య మహిళా కాలేజీలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేశారు. గత కొన్ని రోజులుగా కాలేజీలో జరుగుతున్న విద్యార్థినిలకు సంబందించిన సమస్యలు మీడియాలో రావడంతో విద్యార్థినిల హాస్టళ్లు, మెస్ లను పరిశీలించారు. నాసిరకమైన ఫుడ్, స్టాల్ లలో సౌకర్యాలు సరిగా లేవని నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శ్రీచైతన్య యాజమాన్యానికి సమన్లు పంపించారు.