రుణయాప్‌ల దారుణానికి కరీంనగర్‌కు చెందిన సతీశ్ రెడ్డి గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ఆయన చరవాణికి యాప్‌ల నిర్వాహకుల నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. జనరల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం కోసం వేచి ఉన్న అతని బంధువులు ‘మీ బాధ తాళలేక సతీశ్ చనిపోయాడని చెప్పినా’.. అదంతా మాకు తెలియదు పైసలు కట్టాలి అని హెచ్చరిస్తూనే ఉన్నారు. చివరకు మృతదేహం ఫొటోలను పంపించినా వారి ఫోన్ కాల్స్ ఆగలేదంటే వారి ఆగడాలు, వేధింపులు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.