స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నా.. ప్రచారంలో పాల్గొంటా.. కోర్టులో కవిత వాదన

54చూసినవారు
స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నా.. ప్రచారంలో పాల్గొంటా.. కోర్టులో కవిత వాదన
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు వెల్లడించనుంది. బెయిల్ పిటిషన్ సందర్భంగా కవిత కోర్టు దృష్టికి పలు విషయాలను తీసుకెళ్లారు. పార్టీ స్టార్ క్యాపెంయినర్‌గా ఉన్నందున ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని తెలిపింది. మహిళా నేతగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు అర్హత ఉందని కవిత తెలిపారు. అయితే ఈడీ, సీబీఐ మాత్రం కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోరాయి. కాగా మ.12 గంటలకు పిటిషన్లపై తుది ఉత్తర్వులు వెలువడనున్నాయి.