'ఎవరెవరో నాకెదురైనా' సాంగ్ లిరిక్స్

84చూసినవారు
'ఎవరెవరో నాకెదురైనా' సాంగ్ లిరిక్స్
ఎవరెవరో నాకెదురైనా
నువ్ కలిసాకే మొదలైందే
మెలకువలో కలిలా తోచి
మరుజన్మేదో మొదలైందే

ఏమో ఏం చేస్తున్నానో
ఇంకా ఏమేం చేస్తానో
చేస్తూ ఏమైపోతానో మరీ

ఎవరెవరో నాకెదురైనా
నువ్ కలిసాకే మొదలైందే
మెలకువలో కలిలా తోచి
మరుజన్మేదో మొదలైందే

ప్రపంచం తెలీదే
జతై నువ్వు ఉంటే
ప్రమాదం అనేదే ఇటే రాదే
సముద్రాలకన్న సొగసెంత లోతే
ఎలా ఈదుతున్నా ముంచేస్తుందే

కాల్చుతూ ఉన్నదే
కౌగిలే కొలిమిలా

ఇది వరకు మనసుకు లేని
పరవసమేదో మొదలైందే
మెలకువలో కలిలా తోచి
మరుజన్మేదో మొదలైందే

ఏమో ఏం చేస్తున్నానో
ఇంకా ఏమేం చేస్తానో
చేస్తు ఏమైపోతానో మరీ

ఎవరెవరో నాకెదురైనా
నువ్ కలిసాకే మొదలైందే
మెలకువలో కలిలా తోచి
మరుజన్మేదో మొదలైందే

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you