ఆహార ధాన్యాల సబ్సిడీకి ఎగనామం

79చూసినవారు
ఆహార ధాన్యాల సబ్సిడీకి ఎగనామం
ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ ఎక్కడో చిట్ట చివరన కునారిల్లడానికి ప్రభుత్వాల వైఫల్యమే కారణం. ఆహారం అనేది పౌరుల ప్రాథమిక హక్కు. యుపిఎ ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం తెచ్చింది. మూడింట రెండు వంతుల జనాభా ఆ చట్టం కిందకు వస్తారు. ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున సబ్సిడీపై ఆహార ధాన్యాలివ్వాలి. మోడీ ప్రభుత్వం ఈ చట్టం నిర్వీర్యానికి చేయని ప్రయత్నం లేదు. కరోనా సమయంలో అదనంగా ఇచ్చిన ఉచిత బియ్యం, గోధుమల మాటున అంతకుముందు నుంచీ సబ్సిడీపై ఇస్తున్న ఆహార ధాన్యాలకు ఎగనామం పెట్టింది.

ట్యాగ్స్ :