పిల్లలు క్రీడలు, వ్యాయామ కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయాలి. సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేలా ప్రోత్సహించాలి. చిత్రలేఖనం, పుస్తక పఠనం లాంటి ఆసక్తులను పెంపొందించాలి. డిజిటల్ పరికరాల నుంచి ఒకేసారి దూరం చేయకుండా క్రమేపీ విరామ సమయాన్ని పెంచుతూ వెళ్లాలి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో తరచూ బహిరంగ సంభాషణలకు అవకాశం కల్పించాలి. ఆరోగ్యకరమైన డిజిటల్ జీవనశైలిని ఏర్పాటు చేసుకునే వ్యూహాలను రూపొందించాలి.