నేటి తరం పిల్లలు సెల్‌ఫోన్లకు చాలా అడిక్ట్ అవుపోతున్నారు. ఈ మధ్య కాలంలో చిన్నారులు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకూ స్మార్ట్‌ఫోన్ చూడటం వారికి బాగా అలవాటైపోయింది. వారు భోంచేయాలన్నా, చెప్పిన మాట వినాలన్నా వారికి ఫోన్ ఇవ్వాల్సిందే. ఒక ఇంట్లో పెద్దల దగ్గర నుంచి పసిపిల్లల వరకూ అందరి వేళ్లు టచ్‌స్క్రీన్‌పైనే ఉంటున్నాయి. మాట్లాడటానికి, డబ్బు లావాదేవీలకు, వినోదానికి, కాలక్షేపానికి.. ఇలా అన్ని అంశాలతో సెల్‌ఫోన్ ముడిపడిపోయింది.