ఇప్పటికే దీపావళి హడావుడి మొదలైపోయింది. దీపావళి అంటే దీపాలు ఎంత ముఖ్యమో టపాసులు సైతం అంతే ముఖ్యం అన్న మాదిరిగా మారిపోయింది. ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించాక టపాకాయలు పేల్చడం ఆనవాయితీగా వస్తోంది. అయితే టపాసులు కాల్చే క్రమంలో గాయపడే ప్రమాదం ఉంది. చాలా మంది బయపడి కాల్చడం మానేస్తారు. టపాసులు కాల్చే క్రమంలో గాయపడే వారికి ఫోన్ పే ఇన్సూరెన్స్ కల్పించేందుకు ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ పాలసీ తెచ్చింది.