కొందరు శారీరకంగా, మానసికంగా ఏ కొంచెం బాధ అనిపించినా కన్నీళ్లు పెట్టుకుంటారు. మరికొందరేమో కన్నీళ్లను దిగమింగుతుంటారు. అయితే, ఏడవటం వల్ల అనేక లాభాలున్నాయని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనాల్లో తేలింది. ఏడ్చిన తర్వాత శారీరకంగా, మానసికంగా రెండు విధాలా ప్రయోజనం చేకూరుతుందని, ఏడవటం వల్ల నరాలు రిలాక్స్ అవుతాయంది. కన్నీళ్లు ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఇది సహజ పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుందని పేర్కొంది.