TG: BRSఎమ్మెల్యే సునీతా ఇంటిపై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు గుండా రాజ్యం నడుస్తుందని అన్నారు. బీహార్, రాయలసీమ ఫ్యాక్షన్ మాదిరిగా రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నాడని విమర్శించారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి కాంగ్రెస్ నాయకులు ప్రోత్సహించిందే అన్నారు. వీడియోలు తీస్తున్న హెడ్ కానిస్టేబుల్ పై కూడా కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని ఆరోపించారు.