TG: జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్‌లో ఆర్డీఎస్ కెనాల్‌కు సాగునీరు విడుదల చేసి పంటలు కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నేత వడ్డేపల్లి సూరి మాట్లాడుతూ.. వడ్డేపల్లి, రాజోళి మండలాల్లో వందలాది ఎకరాల్లో వేసిన మొక్కజొన్న, మిరప పంటలు సాగునీరు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.