ధనాబాద్ జంక్షన్ నుంచి అలప్పుళ వెళ్లే అలప్పుళ ఎక్స్‌ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. కేరళ రాష్ట్రంలోని మధుకరై స్టేషన్ వద్ద రైలులోని B4, B5 బోగీల్లో మంటలు చెలరేగాయి. స్టేషన్‌లో ఉన్న సిబ్బంది మంటలను గుర్తించి సిగ్నల్ ఇవ్వడంతో లోకోపైలట్ రైలును నిలిపివేశారు. దీంతో రైలు నుంచి ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. ఈ రైలులో శబరిమలైకు వెళ్తున్న ఇల్లందుకు చెందిన పదిమంది అయ్యప్ప స్వాములు ఉన్నారు. వీరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.