దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (ది గోట్) సినిమా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో గురువారం విడుదలైంది. అయితే ‘ది గోట్ తొలి రోజు వసూళ్ల వివరాలను శుక్రవారం డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 126 కోట్లకుపైగా (గ్రాస్) వసూళ్లు రాబట్టిందని వెల్లడించింది. ఈ చిత్రంలో విజయ్‌తోపాటు ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, వైభవ్, ప్రేమ్జీ తదితరులు నటించారు.