అక్టోబర్‌ 27న నటుడు విజయ్‌ పార్టీ తొలి సమావేశం.. పార్టీ సింబల్‌ ఆవిష్కరణ

83చూసినవారు
అక్టోబర్‌ 27న నటుడు విజయ్‌ పార్టీ తొలి సమావేశం.. పార్టీ సింబల్‌ ఆవిష్కరణ
తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాష్ట్ర స్థాయి తొలి సదస్సును అక్టోబర్ 27న విల్లుపురం జిల్లాలోని సలై గ్రామంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అదే సమావేశంలో పార్టీ గుర్తును సైతం ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. ఆ రోజునే పార్టీ కార్యాచరణ ప్రణాళిక సైతం వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్