ఒకే ఇంట్లో ఐదుగురు దారుణ హత్యకు గురైన భయానక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. లిసారి గేట్ ప్రాంతంలో మోయిన్, అస్మా కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. వారికి అఫ్సా, అజీజా, ఆదిబా కుమార్తెలు. శుక్రవారం రాత్రి ఇంట్లోని వారంతా రక్తపు మడుగులో కనిపించారు. దంపతులు ఇద్దరి మృతదేహాలు ఇంట్లో పడి ఉండగా.. పదేళ్ల లోపు చిన్నారుల మృతదేహాలు బెడ్ కింద బాక్స్‌లో కనిపించాయి. వ్యక్తిగత కక్షలతోనే వారిని హత్య చేసినట్లు ఎస్పీ విపిన్ తెలిపారు.