తెలంగాణ సచివాలయంలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రి బండి సంజయ్ లతో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా జరిగిన నష్టం, ప్రభావిత ప్రాంతాల పరిస్థితులపై ఆయన కేంద్ర మంత్రులకు వివరించారు. వరదల కారణంగా రాష్ట్రంలో సుమారు రూ.5438 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం తెలిపారు. అంతకుముందు, వరద నష్టంపై సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రులు పరిశీలించారు.