పశ్చిమ ఉత్తప్రదేశ్‌లో పొగ మంచు, వాయు కాలుష్యం కారణంగా మంగళవారం దారి కానరాక కార్లు, ఇతర వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు బైకర్లు మరణించారు. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై పరుచుకున్న దట్టమైన పొగమంచు కారణంగా ఓ ట్రక్కును వెనుక నుంచి కార్లు, ఇతర వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించాయి. గాయపడిన వారిని సైఫాయ్ మెడికల్ కాలేజీకి తరలించారు.