వానల్లో ఎన్ని రకాలున్నాయో తెలుసా?

77చూసినవారు
వానల్లో ఎన్ని రకాలున్నాయో తెలుసా?
వానల్లో దాదాపు 25 రకాలున్నాయని పెద్దలు చెబుతుంటారు. కంటికి ఎదురుగా కనిపించనంత జోరుగా కురిసే వానను గాంధారీ వాన అంటారు. ‘తొలకరిలో మృగశిరకార్తెలో కురిసే వానను మాపుసారివానని, తుంపర తుంపరగా కురిసే వానని దుబ్బురు వానని, అలుకు(కళ్లాపి) జల్లినంత కురిసే వానను సానిపివాన’ అని అంటారు. ఒక నాగలిసాలుకు సరిపడా వానను సాలువాన అంటారు. విత్తనాలకు సరిపడా పడే వానను ఇరువాలువాన అని చెబుతారు. పొలం దున్నటానికి సరిపడా నీరు కురిసే వానను మడికట్టువాన అంటారు.

సంబంధిత పోస్ట్