బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై మరో నాలుగు హత్య కేసులు నమోదు

71చూసినవారు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై మరో నాలుగు హత్య కేసులు నమోదు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై స్వదేశంలో నమోదైన కేసుల సంఖ్య 53కు చేరింది. తాజాగా ఆమెతో పాటు మాజీ మంత్రులు, ఉన్నతాధికారులపై మరో 4 హత్య కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసులలో 44 హత్యకు సంబంధించినవి కాగా, మారణహోమానికి సంబంధించి ఏడు ఉన్నాయి. కిడ్నాప్‌కు సంబంధించి ఒక కేసు, బీఎన్‌పీ పార్టీ ఊరేగింపులో జరిగిన ఘర్షణలో మరొకటి చొప్పున కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఆమె భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్