నాలుగేళ్ల బాలుడిపై గొడ్డలితో దాడి చేసి చంపాడు

54చూసినవారు
నాలుగేళ్ల బాలుడిపై గొడ్డలితో దాడి చేసి చంపాడు
AP: అల్లూరి జిల్లా ఎటపాక మండలంలో దారుణం జరిగింది. మద్దిమడుగు గ్రామానికి చెందిన వెంకటేశ్, రమ్య దంపతులకు నాగరాజు (4) అనే చిన్నకొడుకు ఉన్నాడు. సోమవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన కోటేశ్వరరావు సోదరితో కలిసి నాగరాజు మట్టి తేవడానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కోటేశ్వరరావు గొడ్డలితో బాలుడిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో నాగరాజు అక్కడికక్కడే మరణించాడు. తన సోదిరిపై దాడికి ప్రయత్నించగా ఆమె తప్పించుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్