ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత కరెంట్: CM రేవంత్ (వీడియో)

80చూసినవారు
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సోమవారం మంచిర్యాల విద్యార్థులతో సమావేశమైన సందర్భంగా సీఎం ఈ ప్రకటన చేశారు. ఏక ఉపాధ్యాయుడున్న పాఠశాలలు మూత పడుతున్నాయని భావించి ఇటీవల డీఎస్సీ ద్వారా 11,062 మంది టీచర్ల నియామకాలను పూర్తి చేసినట్లు తెలిపారు. చదువు, సామాజిక బాధ్యతపై విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్