కల్తీ పాలు తాగితే ఆరోగ్యానికి హానికరం. అనేకరకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు డిటర్జెంట్ తో కల్తీ అయిన పాలను గుర్తించేందుకు ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సులభమైన పరీక్షను సూచించింది. దీని కొసం ఒక గ్లాసులో 5-10 మి.లీ.ల పాలను తీసుకొని, వాటిని ఒక చెంచాతో వేగంగా కలపాలి. అపుడు ఆ పాలలో ఎక్కువ నురుగు వస్తే వాటిలో డిటర్జెంట్ కలిపినట్లు లెక్క.. నురగ రాకపోతే అవి కల్తీ కానట్లేనని FSSAI తెలిపింది.