అచ్చంపేటలోని వ్యవసాయ మార్కెట్ లో బుధవారం రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. మార్కెట్ లోకి తీసుకోచ్చిన వేరుశెనగను యంత్రాల ద్వారా కాకుండా, చేతులతో తూస్తూ ధర వేస్తున్నారని ఆరోపించారు. ఎంతో కష్టపడి పండించిన పంట తరుగు, కమిషన్ పేరుతో దోపిడీ చేస్తున్నారని అన్నారు. రైతుల ధర్నాతో మార్కెట్ లో క్రయ విక్రయాలు నిలిచి పోయాయి.