ఉపాధి హామీ కూలీలకు టెంటు మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలి

1270చూసినవారు
ఉపాధి హామీ కూలీలకు టెంటు మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలి
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలో డివైఎఫ్ఐ నాయకులు హరీష్ నాయక్ గురువారం ఉపాధిహామీ కూలీల దగ్గరికి వెళ్లి వాళ్ల వివరాలు తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా కూలీలు మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా టెంట్లు ఏర్పాటు చేయాలని మెడికల్ కిట్లు మరియు నీళ్ల కొరత ఎక్కువగా ఉన్నందున వాళ్లకు నీళ్ల సౌకర్యం కల్పించాలని కోరుకున్నారు. అలాగే దాదాపు రెండు నెలలుగా పని చేస్తున్న ఇప్పటివరకు ఒక్కసారి కూడా డబ్బులు రాలేదు అని వాపోయారు కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధి హామీ కూలీలకు త్వరగా బిల్లు పాస్ చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని గ్రామస్తులందరూ హెచ్చరించారు. డివైఎఫ్ఐ నాయకులు హరీష్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి రెండు వందల రోజుల పనిదినాలు కల్పించాలి అలాగే రోజుకు 600 రూపాయలు గిట్టుబాటు కూలీ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూలీలు శ్రీశైలం భీమ సాయి బాబు హెమ్ల లాలి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్