తొలి భారత మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా మార్చి 17, 1962లో జన్మించారు. ఆమె ఒక ఇండియన్-అమెరికన్ వ్యోమగామి. వ్యోమనౌక యంత్ర నిపుణురాలు. భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో జన్మించారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా ఖ్యాతి గడించారు. 1997లో మొదటి సారిగా కొలంబియా స్పేస్ షటిల్‌లో రోబోటిక్ ఆర్మ్ ఆపరేటరుగా ఆమె అంతరిక్షంలోకి వెళ్లారు.