గుజరాత్‌లో సింహాలు గ్రామాల్లోకి ప్రవేశించడం తరచూ చూస్తుంటాం. తాజాగా అలాంటి వీడియోను అటవీ అధికారి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ముగ్గురు యువకులు బైక్‌పై వెళ్తుండగా రెండు సింహాలు సడెన్ ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఆ యువకులు బైక్‌ను అక్కడే వదిలేసి ఒక్కొక్కరిగా అక్కడి నుంచి పారిపోయారు. సింహాలు మాత్రం వారిని పట్టించుకోకుండా వెళ్లిపోయాయి. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.