ఆర్జీకర్ మృతురాలి తల్లిదండ్రుల పిటిషన్.. కొట్టేసిన సుప్రీం

76చూసినవారు
ఆర్జీకర్ మృతురాలి తల్లిదండ్రుల పిటిషన్.. కొట్టేసిన సుప్రీం
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో తల్లిదండ్రుల పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు సీల్దా కోర్టు ఇటీవల జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఈ కేసులో మళ్లీ సీబీఐ విచారణ జరిపించాలని మృతురాలి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు తాజాగా ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. కోల్‌కతా హైకోర్టులో ఈ పిటిషన్‌ను కొనసాగించొచ్చని తెలిపింది.

సంబంధిత పోస్ట్