ప్రమాదకరంగా మారిన ఐజ్ చౌరస్తా విద్యుత్ వైర్లు

74చూసినవారు
ప్రమాదకరంగా మారిన ఐజ్ చౌరస్తా విద్యుత్ వైర్లు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలోని చౌరస్తా పెట్రోల్ పంప్ వద్ద, రామన్ గౌడ్ వైన్ షాప్ పక్కన ఉన్న విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా మారాయి. మంగళవారం చెట్ల కొమ్మలు తగిలిపడిన సమయంలో నిప్పు రవ్వలు పడ్డాయని స్థానికులు తెలిపారు. రోజుకు వేలాది మంది ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తారు. కావున విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి చెట్ల కొమ్మలను తొలగించి ప్రమాదాన్ని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్