అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లతో కలిసి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అసెంబ్లీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని, అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.