Feb 16, 2025, 08:02 IST/
కాంగ్రెస్‌లోని రెండు వర్గాల మధ్య ఘర్షణ
Feb 16, 2025, 08:02 IST
TG: సూర్యపేట జిల్లా చిలుకూరు మండలంలో ఉద్రిక్తత నెలకొంది. బేతావోలు గ్రామంలో కాంగ్రెస్‌లోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీతారామస్వామి దేవాలయ పునఃనిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి బజ్జూరు వెంకటరెడ్డి వర్గం, నాగయ్య వర్గం హాజరయ్యాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు ఒకరినొకరు దూషించుకున్నారు. ఇది కాస్తా రాళ్ల దాడికి దారితీయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సీఐ రజిత తమ సిబ్బందితో కలిసి ఇరువర్గాలను చెదరగొట్టారు.