AP: వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి.. వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.