కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో గుడిసెలో మంటలు, సీడ్ పత్తి దగ్ధం
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని ఇందువాసి గ్రామంలో శనివారం మధ్యాహ్నం హరిజన ఆదాం ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల గుడిసెలో మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో నిల్వచేసిన సుమారు 4 క్వింటాళ్ల సీడ్ పత్తి పూర్తిగా కాలిపోయింది. రైతు ఆర్థికంగా నష్టపోయాడని ప్రభుత్వ సహాయం తప్పనిసరిగా అందించాలని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.