ఆటపాటలతో మానసిక ఉల్లాసం: ఎంపీపీ

77చూసినవారు
ఆటపాటలతో మానసిక ఉల్లాసం: ఎంపీపీ
గట్టు మండలం చాగదోన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎం. వి. ఫౌండేషన్ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ విజయ్ కుమార్ పాల్గొని విద్యార్థులకు ఆట వస్తువులను పంపిణీ చేశారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఆటలు పాటలు ద్వారా విద్యార్థులకు శారీరక వికాసం, మానసిక ఉల్లాసం కలిగి మేధోసంపత్తిని పెంచుకోవాలని, విద్యతో పాటు ఆటలకు సమయం కేటాయించాలన్నారు.

సంబంధిత పోస్ట్