గట్టు మండలంలోని గొర్లఖాన్ దొడ్డి గ్రామంలో దళిత యువకుడిపై దాడి జరిగిన ఘటన గ్రామంలో కలకలం రేపింది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం, మల్దకల్ అనే దళితుడు ధర్మారెడ్డి దగ్గర 20 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో ధర్మారెడ్డి, మల్దకల్ ఇంటికి వచ్చి అప్పు కట్టమని డిమాండ్ చేయగా, తను అప్పటి వరకు డబ్బు లేదని చెప్పినందుకు తీవ్ర ఆగ్రహంతో దాడి చేయడం జరిగింది.