నీట్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: కుతుబ్

55చూసినవారు
నీట్ పరీక్షలో అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి కుతుబ్ డిమాండ్ చేశారు. మంగళవారం అమరచింతలో మాట్లాడుతూ. మే 4 న పరీక్ష పెట్టగా 24 లక్షల మంది పరీక్ష రాశారన్నారు. ఒకే సెంటర్ లో 6 మందికి ఒకే మార్కులు రావటం విచిత్రం అని, పిల్లల జీవితాలతో ఆడుకోవద్దన్నారు. రద్దుచేసి మళ్లీ పరీక్ష పెట్టాలని డిమాండ్ చేశారు.