
కోడేరు: స్థలం లేక రైతుల ఇబ్బందులు
రైతులు పండించిన వివిధ రకాల ధాన్యం ఆరపోయడానికి స్థలం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నాయకులు శివశంకర వరప్రసాద్ అన్నారు. సోమవారం కోడేరు మండలంలోని జనుంపల్లి గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై మొక్కజొన్న ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం ఆరబోయడానికి స్థలం లేక రోడ్లపై ఆరపోసినట్లు రైతులు తెలిపారు. అధికారులు స్పందించి కల్లాలు ఏర్పాటు చేయాలని కోరారు.