అన్ని వర్గాల అభివృద్ధికి
కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. పట్టణంలోని ఉప్పునుంతల రోడ్డు
భారత్ గ్యాస్ సమీపంలో బోయ కులస్థుల కోసం నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సోమవారం బోయ కుల సంఘం సభ్యులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, పోకల మనోహర్, సుంకరి బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.